Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సిలో వేసిన భారీ సెట్లో ఓ మాస్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ పాటను మహేష్ బాబు, కీర్తి సురేష్ , డ్యాన్సర్లపై చిత్రీకరణ చేస్తున్నారు.
ఈ సందర్భంగా లొకేషన్లో తీసిన స్టిల్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. కాళ్ళకి రెడ్ కర్చీఫ్ కట్టుకొని మహేష్‌బాబు చాలా మాస్‌గా ఈ పాటలో కనిపించబోతున్నారని, ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన భారీ సెట్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుందని స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ పాట చిత్రీకరణతో సినిమా మొత్తం పూర్తవుతుంది.
తమన్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు విశేష ఆదరణతో సూపర్ హిట్స్‌గా నిలిచాయి. భారీ అంచనాలతో మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, ఏఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల,
సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: ఆర్ మధి, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, సీఈవో: చెర్రీ, వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ : యుగంధర్.