Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రియ శరణ్, శర్మణ్ జోషి, షాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మ్యూజిక్ స్కూల్'. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ని ఇటీవల గోవాలో పూర్తి చేశారు. గోవాలో పూర్తి చేసిన షూటింగ్‌తో దాదాపు 95 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది.
ఈ సందర్భంగా దర్శకుడు పాపారావు మాట్లాడుతూ, 'గొప్ప విషయ పరిజ్ఞానం కలిగిన వారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గోవా సీనిక్ బ్యూటీని మా సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహాన్స్ అత్యంత సుందరంగా క్యాప్చర్ చేశారు. మా సినిమాలో ఈ ఫోర్త్ షెడ్యూల్ చాలా స్పెషల్. అంత ప్రత్యేకమైన షెడ్యూల్‌ని గోవాలో చిత్రీకరించడం చాలా ఆనందంగా అనిపించింది. మన దేశంలో చూడగానే ఆకట్టుకునే విజువల్ స్ట్రైకింగ్ స్టేట్స్లో గోవా తొలి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఆ అందాన్నంతా మా సినిమాలో చూపించాం. హైదరాబాద్‌లో ఫైనల్ పాటను ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తామా? అని ఆతతగా వెయిట్ చేస్తున్నాం' అని అన్నారు. నటుడు షాన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా షూటింగ్ చేస్తున్నంత సేపు చాలా అద్భుతంగా అనిపించింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం కుటుంబంలోని వ్యక్తుల్లాగా కలిసిపోయాం. సరదాగా గడిపాం. సినిమా రూపుదిద్దుకున్న విధానాన్ని తెరమీద చూడాలనే ఆతత ఉంది. సినిమా రిలీజ్‌కి రెడీకాగానే పనిచేసిన అందరినీ రీ యూనియన్ పార్టీలో కలుసుకోవాలని ఉంది' అని చెప్పారు. 'ఓ మంచి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నేనొక మంచి పాత్ర చేశాను. ఈ పాత్ర ఎలా ఉంటుందనేది నా మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్‌గా ఫీలవుతారు' అని శ్రియా తెలిపారు. యామిని ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను హిందీ, తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. కిరణ్ డియోహాన్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.