Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హీరో విశ్వక్సేన్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. 'రాజాగారు రాణివారు' డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6న భారీ స్థాయిలో విడుదలవుతుంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 'డైరెక్టర్ విద్యాసాగర్‌తో నాది తొమ్మిదేళ్ల ప్రయాణం. సినిమా చాలా బాగా వచ్చింది. రీసెంట్గా సినిమా చూశాను. నేను ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ.. ఇప్పుడు చెబుతున్నా.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇదే అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. బాపినీడు, సుధీర్, రవి కిరణ్, విద్యాసాగర్‌లకు థ్యాంక్స్. ఈ సినిమాతో ఇంట్లోని అందరూ నాతో లవ్‌లో పడిపోతారు. మే 6న ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి. మంచి ట్రీట్ అవుతుంది' అని అన్నారు. 'మా ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. మా బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి సినిమా అని కచ్చితంగా చెప్పగలం' అని నిర్మాత బాపినీడు తెలిపారు.
మరో నిర్మాత సుధీర్ ఈదర మాట్లాడుతూ, 'విశ్వక్ సేన్, రవి కిరణ్ కోలాకు థ్యాంక్స్ చెప్పాలి. రవి కిరణ్ అయితే కథను అందించడంతో పాటు సినిమా బాగా రావడంలో సపోర్ట్ చేశారు. అలాగే విశ్వక్ మంచి సపోర్ట్ చేశాడు. మంచి టీమ్‌తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది' అని అన్నారు. 'నిర్మాతలు బాపినీడు, సుధీర్ మమ్మల్ని నమ్మడం వల్లే ఇంత మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. ఇక మా షో రన్నర్ రవి కిరణ్ కోలా గారికి పెద్ద థాంక్స్ చెప్పాలి. విశ్వక్ సేన్ నటనను చూసి 'హే కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నారురా భారు' అంటారు. సినిమా చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. కళ్లలో నీళ్లు కూడా తిరుగుతాయి' అని డైరెక్టర్ విద్యాసాగర్ చింతా చెప్పారు.