Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రాబోయే ఆదివారం (24వ తేదీ) 'వలిమై' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో పాటు సుస్వరాల వేదిక 'స రి గ మ ప..'లో ఉత్కంఠభరిత ఎలిమినేషన్ ఎపిసోడ్‌తో రెండింతల వినోదాన్ని పంచడానికి జీ తెలుగు రంగం సిద్ధం చేసింది. అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'వలిమై'. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా సర్వత్రా విశేష ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించింది. ఇందులో ప్రతినాయకుడిగా టాలీవుడ్ యువ కథానాయకుడు కార్తికేయ నటించటం విశేషం. వెండితెర ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన ఈ సినిమా జీ తెలుగు ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం ఫిదా చేసేందుకు రాబోయే ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రీమియర్ కానుంది. అలాగే 'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' ఎలిమినేషన్ ఎపిసోడ్ రాత్రి 9: 00 గంటలకు ప్రసారం కానుంది. ప్రేక్షకుల హదయాల్ని గెలుచుకున్న పార్టిసిపెంట్స్‌లో ఎవరు నెక్ట్స్ రౌండ్స్‌కి వెళ్తారు?, ఎవరు వెనుతిరుగుతారు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్‌ని తప్పక చూడాల్సిందేనని, అలాగే రచయత కాసర్ల శ్యామ్ ప్రతేక్య అథితిగా విచ్చేసి ఈ ఎపిసోడ్‌ని మరింత వినోదభరితంగా మార్చిన వైనాన్ని కూడా తప్పకుండా వీక్షించి తీరాల్సిందేనని, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేందుకు జీ తెలుగు ఎప్పటికప్పుడు తనదైన పంథాలో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోందని జీ తెలుగు ప్రతినిధి బృందం తెలిపింది.