Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా రూపొందిన చిత్రం '1996 ధర్మపురి'. జగత్ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమా నిర్మించారు. నేడు (శుక్రవారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించింది. ఈ చిత్ర బిగ్ టికెట్‌ను నిర్మాత రవి విడుదల చేశారు.
ఈ సందర్భంగా సమర్పకుడు శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ,'రూరల్ బ్యాక్ డ్రాప్లో జరిగిన ట్రూ బేస్డ్ లవ్ స్టొరీ ఇది. దర్శకుడు జగత్ కథ చెప్పినరోజే ఈ సినిమా అందరి హృదయాలకు దగ్గరవుతుందని నేను ఈ చిత్రంలో పార్ట్ అయ్యాను. చాలా రియలిస్టిక్‌గా, చాలా నేచురల్ ఫెర్ఫార్మెన్స్‌తో తీసిన ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఓషో వెంకటేష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా పెద్ద మ్యాజిక్ చేసింది' అని తెలిపారు. 'డిఫరెంట్ సబ్జెక్ట్‌తో నేడు (శుక్రవారం) వస్తున్న మా సినిమాకి సపోర్ట్ చేస్తూ, రిలీజ్ చేస్తున్న ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వారికి, గీతా ఆర్ట్స్ వారికి ధన్యవాదాలు. ఇందులో నేను మూడు పాటలు రాశాను. ఈ పాటలకు మంచి రెస్పాన్స్ రావడానికి ముఖ్య కారణం శేఖర్ మాస్టర్. తన వల్లే మా సినిమాకు ఇంత మంచి పేరు వచ్చింది' అని నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి చెప్పారు. దర్శకుడు జగత్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలోని నాగమల్లి, సూరి క్యారెక్టర్లు చాలా సహజంగా ఉంటాయి. సినిమా అయిపోయిన తర్వాత కూడా మీతోనే ట్రావెల్ అవుతాయి.ఈ కథకు గగన్ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేశాను. అంతే తప్ప గగన్ కోసం ఈ సినిమా చెయ్యలేదు.మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించండి' అని అన్నారు.