Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్‌తో 'గురు', సూర్యతో 'ఆకాశం నీ హద్దురా' వంటి చిత్రాలను రూపొందించి, భారీ సక్సెస్‌లు అందుకున్న దర్శకురాలు సుధా కొంగర. 'కేజీఎఫ్', 'కేజీఎఫ్2' వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో ఆమె ఓ సినిమాని రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో 'సలార్' చిత్రాన్ని నిర్మిస్తున్న ఇదే బ్యానర్లో సుధా కొంగర సినిమా చేస్తోందనే అధికారిక ప్రకటన అందరిలోనూ అమితాసక్తిని క్రియేట్ చేసింది. 'కొన్ని కథలు ప్రజలకు చెప్పటానికి అర్హమైనవి. వాటిని సరైన పద్ధతిలో ఆవిష్కరించాలి. మా తదుపరి చిత్రాన్ని దర్శకురాలు సుధా కొంగరతో నిర్మిస్తున్నట్లు ప్రకటిస్తున్నందుకు గర్వపడుతున్నాం. మా అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా విభిన్నమైనది' అని మేకర్స్ తెలిపారు.