Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నాని నటించిన తాజా చిత్రం ''అంటే.. సుందరానికీ'. లేటెస్ట్గా రిలీజైన ఈచిత్ర టీజర్ నవ్వులు పూయించింది. నాని నుంచి వినోదాత్మక చిత్రాలు ఆశించే ప్రేక్షకులకు సుందరం పాత్ర కావలసినంత వినోదం పంచుతుందనే భరోసా ఈ టీజర్ ఇచ్చింది. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులు నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
'మా టీజర్ రికార్డ్ వ్యూస్ సాధించింది. కేవలం 24 గంటల్లో టీజర్‌కు 11 మిలియన్ల వ్యూస్ దక్కాయి. నాని కెరీర్ ఇదే హయ్యస్ట్ వన్ డే రికార్డ్. టీజర్‌కి వచ్చిన వ్యూస్, లైక్స్ చూస్తుంటే సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వేరే చెప్పక్కర్లేదు. క్రిస్టియన్ అమ్మాయి నజ్రియా ప్రేమలో పడిన బ్రాహ్మణ కుర్రాడిలా నానిని విభిన్న పాత్రలో దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్రజెంట్ చేశారు. టీజర్లో లవ్ ట్రాక్ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా, ప్లెజెంట్‌గా అనిపించింది. అలాగే కథలో ఓ కీలకమైన అంశం ఉందని హింట్ ఇచ్చేలా టీజర్ డిజైన్ చేయడం ఆకట్టుకుంది. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది' అని చిత్ర యూనిట్ తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, నికేష్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా పని చేస్తున్నారు.