Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో ఓ సరికొత్త కాంబినేషన్లో సినిమా మొదలైంది.
విజరు దేవరకొండ హీరోగా శివ నిర్వాణ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడం ఓ విశేషమైతే, ఇందులో హీరోయిన్గా సమంత నటిస్తుండటం మరో విశేషం.
ప్రారంభం రోజే హాట్ టాపిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా
నిర్మిస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా, 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు.
'లైగర్' సినిమా కోసం హెవీ మేకోవర్ అయిన విజరు దేవరకొండ ఈ సినిమా కోసం చాక్లెట్బారులా మారటం ఈ సినిమా ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. ఆయన తీరు చూస్తుంటే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. 'గీత గోవిందం' లాంటి ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్తో విజరు దేవరకొండ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 'లైగర్' వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత మళ్లీ ఓ చక్కటి కుటుంబ కథలో నటిస్తున్నారు. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి తన దైన శైలిలో సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతున్నారు. గతంలో 'మహానటి' చిత్రంలో విజరు, సమంత కలిసి నటించగా, ఈ సినిమాలో పూర్తి స్థాయి నాయకానాయికలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్లో మొదలవుతుందని, అక్కడ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పిలో మిగతా షూటింగ్
జరుపుతారని చిత్ర బృందం తెలిపింది.
జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మేకప్: బాషా, ఆర్ట్: ఉత్తర కుమార్, చంద్రిక, ఫైట్స్: పీటర్ హెయిన్,
రచనా సహకారం: నరేష్ బాబు.పి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్, మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి, నిర్మాతలు : నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.