Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్ నారాయణ దాస్ నారంగ్ అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన నారాయణ దాస్ నారంగ్ సంతాప సభలో పలువురు సినీ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. అలాగే ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, 'నారాయణ దాస్ నారాంగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సమస్య చిన్నదైనా, పెద్దదైనా క్షుణ్ణంగా పరిశీలించి, ఆ సమస్య మళ్లీ రాకుండా పరిష్కారం చేస్తారు' అని తెలిపారు. ఎన్టీఆర్ కాలంనాటి నుంచి నారయణ దాస్ పరిశ్రమకు సేవలందించారు. మాట ఇస్తే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అదే పద్దతి ఆయన తనయుడు సునీల్‌కు వచ్చింది. చిన్న సినిమాలకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించారు' అని ప్రసన్నకుమార్ చెప్పారు.
దర్శక, నిర్మాత వై.వి.యస్ చౌదరి మాట్లాడుతూ, 'నారాయణదాస్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. సినిమాకు ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ దాని నుంచి బయట పడేసి ముందుకు తీసుకెళ్తారు. ఎవరితోనూ గొడవలు లేకుండా ఇరువైపులవారికి న్యాయం జరిగేలా చేస్తారు' అని అన్నారు.