Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా రూపొందుతున్న చిత్రం 'లక్కీ లక్ష్మణ్'.
ఎ.ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది.
ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాతలు మిరియాల రవీంద్ర రెడ్డి, బెక్కం వేణుగోపాల్, పుప్పాల రమేష్, రాజా రవీంద్ర స్క్రిప్ట్‌ను అందించగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో సోహైల్, హీరోయిన్ మోక్షపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి క్లాప్ కొట్టారు. మరో అగ్ర నిర్మాత సి.కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అప్పిరెడ్డి ''లక్కీ లక్ష్మణ్'' మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భగా ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ, 'అభి ఎంతో ప్రతిభగల దర్శకుడు. తనకు సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఎప్పుడూ సినిమా డైలాగ్స్ చెబుతూ, కథలు డిస్కషన్ చేసేవాడు. తన తపన చూసి నా రియల్ ఎస్టేట్ బిజినెస్‌లను పక్కనపెట్టి, సినిమా ఇండిస్టీలోకి వచ్చాను. అభి చెప్పిన కథ ఫ్రెష్‌గా అనిపించడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను' అని తెలిపారు. 'హరిత గోగినేనిగారు నీ దగ్గర మంచి కథ ఉంటే చెప్పామన్నారు. లక్కీగా నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అందుకే ఈ సినిమా టైటిల్లో 'లక్కీ' అని పెట్టాను. ఈ టైటిల్ కూడా కథలోనుండి వచ్చిందే. హీరో సోహైల్‌కు ఈ కథ చెప్పగానే తను ఫస్ట్ సిట్టింగ్‌లోనే గ్రీన్ సిగల్ ఇచ్చారు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఆండ్రూ, అనూప్ రూబెన్స్, ప్రవీణ్ పూడి, భాస్కర పట్ల వంటి సీనియర్ టెక్నిషన్స్‌ను తీసుకువచ్చారు. ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని దర్శకుడు అభి అన్నారు.
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ, ''లక్కీ లక్ష్మణ్'' టైటిల్లోనే లక్ ఉన్నట్టు సొహైల్‌కు కూడా మంచి లక్ ఉంది. అందుకే ఈమధ్య భిన్న సబ్జెక్ట్స్లను సెలెక్ట్ చేసుకుంటూ, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఆయన తెలుగు ఇండిస్టీలో ఒక ఆయుష్మాన్ ఖురాన్‌లా ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర మోషన్ పోస్టర్ కూడా చాలా క్రియేటివ్‌గా ఉంది. మొదటి సారి సినిమా చేస్తున్న దర్శక, నిర్మాతలు ప్రేక్షకులకు ఒక మంచి కాఫీ లాంటి సినిమా ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది' అని చెప్పారు.
చాలా మంది సొహైల్ వెంట వెంటనే సినిమాలు ఒప్పుకుంటున్నాడు ఏంటి అని అనుకోవచ్చు. నాకు కథ నచ్చితేనే సినిమా చేయటానికి గ్రీన్‌సిగల్ ఇస్తాను. మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో, సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచి కలిగి ఉన్నారు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, అవుట్‌ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్‌తో మా నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి మహిళా నిర్మాతలు ఇండిస్టీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు.
- హీరో సొహైల్