Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'భళా తందనాన'. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు లిరికల్ వీడియోస్‌కి కూడా మంచి స్పందన లభించింది. టీజర్, లిరికల్ వీడియోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ చిత్రాన్ని ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. వేసవి సెలవులు, మే 3న రంజాన్ పండగని దృష్టిలో పెట్టుకుని వచ్చే వారంలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందినఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా కథానాయికగా నటించింది' అని చెప్పారు.