Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఆన్'.
రవి కస్తూరి సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకంపై కుమార్ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు శనివారం ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త పమిడి రమేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ, 'లూజర్‌గా ఉన్న ఓ యువకుడు ఎలా విన్నర్ అయ్యాడు అనేదే ఈ సినిమా. ఊహించని రీతిలో ఉంటే ట్విస్ట్‌లు అందర్నీ థ్రిల్ చేస్తాయి. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ విత్ ఇండియన్ కోర్ ఎమోషన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. రెండు షెడ్యూల్స్‌లో ఈ సినిమాని పూర్తి చేస్తాం' అని తెలిపారు. 'ఈ చిత్రంలో యూత్‌ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. ఈ స్క్రిప్ట్ కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు. అవుట్‌ఫుట్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు వస్తున్న ట్రెండ్‌కు అనుగుణంగా వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది' అని నిర్మాతలు తెలిపారు.
హీరో గీతానంద్ మాట్లాడుతూ, 'ఇదొక సైకలాజికల్ యాక్షన్ డ్రామా. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలో బెస్ట్ సినిమా అవుతుంది' అని చెప్పారు. 'నేను ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ని చేయలేదు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి సినిమాలో నటించటం హ్యాపీగా ఉంది' అని హీరోయిన్ నేహా సోలంకి అన్నారు.