Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజశేఖర్ హీరోగా నటించిన 91వ సినిమా 'శేఖర్'. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం ఎఫ్ఎన్సిసిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, ''గరుడవేగ', 'కల్కి' వంటి మంచి హిట్ సినిమాలు చేసిన తర్వాత రాజశేఖర్ గారితో డిఫరెంట్ గెటప్‌తో ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఇలాంటి మంచి సినిమా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక దశలో రాజశేఖర్ గారికి హెల్త్ సహకరించక పోయినా ఈ సినిమాకు ఎంతో ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమా చూసిన ముత్యాల రాందాస్ గారు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. మే 20న విడుదలయ్యే ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు. 'ప్రతి ఒక్కరి హార్ట్‌కు టచ్ అయ్యే సినిమా ఇది. కోవిడ్ తరువాత ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎమోషనల్ సఫ్ఫరింగ్ను ఇందులో చూస్తారు. ప్రేక్షకులు ఎప్పుడు ఎమోషనల్ ఫిలిమ్స్‌ని ఆదరిస్తూనే ఉన్నారు. రాజశేఖర్‌గారు నటించిన 'గోరింటాకు, అక్కమొగుడు,మా అన్నయ్య, సింహారాశి' దగ్గర్నుంచి చాలా సినిమాలను ఆదరించారు. ఆ సినిమాలకంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉండే సినిమా ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎమోషనల్‌గా అవుతారు. ఈ సినిమాలో రాజశేఖర్ గారి కూతురు పాత్రలో శివాని నటించింది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా సెంటిమెంటల్‌గా ఉంటాయి' అని దర్శకురాలు జీవితా రాజశేఖర్ చెప్పారు.
ముత్యాల రాందాస్ మాట్లాడుతూ, 'నాకు రాజశేఖర్ గారు అంటే ఎంతో ఇష్టం. ఈ సినిమాను చూపించమని అడిగిన వెంటనే జీవిత గారు, నిర్మాతలు ఈ సినిమాని చూపించారు. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మే 20న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాను' అని చెప్పారు.