Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శేఖర్ వర్మ, వైభవి జంటగా ఎస్ఎంఎస్ క్రిియేషన్స్ బ్యానర్ పై బోయపాటి రఘు బాబు నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణమస్తు'. ఒ.సాయి దీనికి దర్శకుడు. తాజాగా ఈ సినిమాలోని 'ముక్కుపుడక' లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించటంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
'గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర..సుర సుర నీ చూపుల్లో ఉందే మందుపాతర.. నిగ నిగ నీ బుగ్గల్లో నింపినావే చక్కెర..' అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, ధవన్ అద్భుతంగా పాడారు. వీళ్ళు పాడిన తీరుతోపాటు హీరో శేఖర్ వర్మ వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే పాటను చిత్రీకరించిన విధానానికి కూడా అభినందనలు లభిస్తున్నాయి. ఓ మంచి కాన్సెప్ట్‌తో మా దర్శకుడు సాయి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం, వివిఎన్వి సురేష్ ఎడిటింగ్ పనితనం, నాయకానాయికలు శేఖర్‌వర్మ, వైభవి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నాం' అని నిర్మాత బోయపాటి రఘుబాబు చెప్పారు. 'నన్ను, నా కథని నమ్మి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్న మా నిర్మాత రఘుగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. లేటెస్ట్గా రిలీజైన 'ముక్కుపుడక' పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఈ పాటలో మా కథానాయకుడు శేఖర్ వర్మ అద్భుతంగా స్టెప్స్ వేశాడు. లిరికల్‌గా, విజువల్‌గా, డాన్స్‌పరంగా ఈ పాట అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాట మాదిరిగానే సినిమా కూడా అందర్నీ కచ్చితంగా అలరిస్తుంది. సినిమాలో కంటెంట్ బాగుంటే మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా కూడా' అని దర్శకుడు సాయి అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : వివిఎన్వి సురేష్, సింగర్స్ : మంగ్లీ, ధవన్, లిరిసిస్ట్ : అలరాజు.