Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ధృవ', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' నా మనసుకి బాగా దగ్గరైన చిత్రాలు. అలాగే 'ఆచార్య'లో సిద్థ నాకు బాగా దగ్గరైన పాత్ర. ఆ సినిమాలు సాధించిన విజయం కన్నా 'ఆచార్య' ఘన విజయం సాధిస్తుంది' అని రామ్‌చరణ్ అన్నారు.
ఈ నెల 29న 'ఆచార్య' రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆదివారం రావమ్చరణ్ మీడియాతో మాట్లాడుతూ, 'ఈ 20 ఏళ్లలో మా నాన్నను చూసి ఏం నేర్చుకున్నానో తెలియదు కానీ, 'ఆచార్య' చిత్రీకరణ కోసం మారేడుమిల్లిలో ఉన్న 20 రోజుల్లో ఎంతో నేర్చుకున్నా. ఇద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కలిసి వ్యాయామం, భోజనం చేశాం. నా జీవితంలో మర్చిపోలేని రోజులవి. చదువుకుంటున్నప్పుడు కాలేజ్‌లో 'ఆచార్య'కు దూరంగా ఉన్నా. ఇంట్లో ఉన్న 'ఆచార్య'కు దగ్గరగా ఉన్నా. పెద్దలకు గౌరవం ఎలా ఇవ్వాలో, సినిమా విజయం సాధిస్తే ఎలా ఉండాలి?, పరాజయం పాలైతే ఎలా ఉండాలనే విషయాలు నాన్న నుంచే నేర్చుకున్నా. యువీ క్రియేషన్స్‌లో 'మిర్చి' వచ్చినప్పటి నుంచి కొరటాల శివతో సినిమా చేద్దామని అనుకుంటున్నాం. ఈ చిత్రంతో కుదిరింది. ఇదే మా డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది. ఆయన రైటింగ్‌లో ఒక ఛరిష్మా ఉంటుంది. అదే ఈ కథలో మమ్మల్ని కట్టిపడేసింది. నాన్నమీద గౌరవంతో, అమ్మ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో 'ఆచార్య' కోసం 'ఆర్ఆర్ఆర్'లో ఉన్న నాకు రాజమౌళి డేట్స్ ఇచ్చారు. ఆయనకు రుణపడి ఉంటా. నాన్నతో కలిసి ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించటం చాలా ఆనందంగా ఉంది. నాన్నతో కలిసి నటించే ఇలాంటి అద్భుతమైన అవకాశం మరోమారు వస్తుందో రాదో నాకు తెలీదు' అని చెప్పారు.