Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూరెడ్డి విష్ణు సమర్పించిన పరశురాం శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో నిర్మించిన 'రణస్థలి' చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకులు జాగర్లమూడి క్రిష్ విడుదలచేశారు. ఈ కార్యక్రమం ఆదివారం అన్నపూర్ణా స్టూడియోస్‌లో నిర్వహించారు. 'చిన్న చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్ తీయటం చాలా గొప్ప విషయం, కెజిఎఫ్ చిత్రంలా అనిపించింది' అని డైరెక్టర్ పరశురాం శ్రీనివాస్‌ని క్రిష్ అభినందించారు. ఈ కార్యక్రమములో దర్శకులు పరశురాం శ్రీనివాస్, కెమెరామెన్ జాష్టి బాలాజీ, ఎడిటర్ భువన్, నటులు ధర్మ, ప్రశాంత్, శివ,నాగేంద్ర, కెమెరా అసిస్టెంట్ సాయి, డైరెక్టర్ అసిస్టెంట్ మూర్తి పాల్గొన్నారు.