Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంకర్ సుమ కనకాల నటించిన పూర్తి స్థాయి సినిమా 'జయమ్మ పంచాయితీ'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమయ్యింది. సమ్మర్ కానుకగా మే 6న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం తాజాగా 'గొలుసుకట్టు గోసలు' అనే పాటను విడుదల చేశారు. 'కలిసి బతికే కాలమే మాయే.. నేడే' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇది సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని సూచిస్తుంది. ఈ గీతానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. చైతన్య ప్రసాద్ మంచి సాహిత్యం అందించగా.. కీరవాణితో కలిసి సింగర్ చారు హరి హరన్ ఆలపించారు. విజరు కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాని నిర్మించారు.