Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డ్యూడ్' అనే కొత్త ఓటీటీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తాజాగా 'డ్యూడ్' లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 'డ్యూడ్' ఓటీటీ వ్యవస్థాపకుడు, దర్శక-నిర్మాత ఈశ్వర్ మాట్లాడుతూ.. 'ప్రతిభావంతులకు సరైన మార్గాన్ని ఏర్పరచాలనే ధ్రుడ సంకల్పంతో నేను, ధూళిపూడి 'డ్యూడ్'కి నాంది పలికాం. ఇందులో సినిమా, వెబ్‌సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్, లైవ్ న్యూస్.. ఇలా ఎన్నో ఉంటాయి' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజీవ్, స్పాన్సర్లు సద్గురు, సమై శేఖర్, హీరోయిన్స్ డోరిస్, హరిత పాల్గొన్నారు.