Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెగాస్టార్ నటించిన తాజా చిత్రం 'ఆచార్య' ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్, చిరంజీవి కీలక పాత్రలో నటించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డి ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించడంలేదని దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'ముందు సినిమా అనుకున్నప్పుడు ఓ ఫన్నీ క్యారెక్టర్ పుట్టింది. ధర్మస్థలిలో ఆ పాత్ర చాలా ఫన్నీగా సాగుతుంటుంది. ఆ పాత్రకు కాజల్‌ని అనుకున్నాం. ఆచార్య ఈ పాత్ర పక్కన కాజల్ అనుకున్నప్పుడు 3 నుంచి 4 రోజులు షూటింగ్ చేశాం. కానీ షూట్ చేసిన కొన్ని సీన్లు చూశాక, అంత పెద్ద హీరోయిన్.. ఏదో క్యారెక్టర్ వుండాలి కాబట్టి అన్నట్టుగా పెట్టకూడదు. పైగా 'ఆచార్య'కు లవ్ ఇంట్రెస్ట్ లేదు. పాటలూ పెట్టలేం. ఇన్ని లిమిటేషన్స్ మధ్య కాజల్ పాత్రని చిన్నగా చూపించడం చాలా తప్పు అనిపించింది. చిన్న పాత్ర కోసం కాజల్‌ని తప్పుగా చూపించినట్టుగా వుంటుందనిపించింది. ఇదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే నువ్వు నమ్మింది చేయి అన్నారు. అదే విషయాన్ని కాజల్‌కు చెప్పాను. విషయం అర్థమై నవ్వుతూ తప్పుకుంది. ఆ తరువాత సినిమా మిస్సవుతున్నానని ఫీలైంది కూడా. ఆలోచించి కాజల్ సహకరించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని కొరటాల శివ అసలు విషయం బయటపెట్టారు.