Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేసిన ఆల్బమ్ ఇప్పటికే మ్యాజిక్‌ని క్రియేట్ చేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'కళావతి..' పాట మెలోడీ అఫ్ ది ఇయర్‌గా నిలిచింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌ని సొంతం చేసుకుని, అందర్నీ అలరిస్తోంది. ఇప్పటికే 100 మిల్లియన్ల వ్యూస్‌తో రికార్డ్ సష్టించిన ఈ పాట లేటెస్ట్గా టాలీవుడ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.9 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకుందని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా తెలిపింది.
''కళావతి..' పాట ఇంటర్నెట్ సెన్సేషన్‌గా నిలవడమే కాకుండా పలు ఆడియో స్ట్రీమింగ్ వేదికలు, యాప్స్‌లో టాప్ సాంగ్ లిస్ట్‌లోనూ కొనసాగుతోంది. యుట్యూబ్లో కూడా ట్రెండింగై, అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాటలో మహేష్ బాబు క్లాసీ డ్యాన్సులు ఫ్యాన్స్‌ని ఫిదా చేశాయి. అనంత శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యం అందించగా, సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తన వాయిస్‌తో మరోమారు మెస్మరైజ్ చేశారు. ఈ పాటతో పాటు 'పెన్నీ', టైటిల్ సాంగ్ 'ఆయుధాలు లేని వేట.. రివర్స్ లేని బాట..' కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. పాటలన్ని హిట్ అవ్వడంతో సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది.