Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ 'ఏటీఎమ్'. జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్‌తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ వెబ్ సిరీస్ దర్శకుడు సి.చంద్ర మోహన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్‌గా చేసిన ప్రకటన టాలీవుడ్‌ను బాగా ఆకర్షించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. థ్రిల్లర్ కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఆద్యంతం ఆసక్తికరంగా అందరూ మెచ్చేలా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోందనే నమ్మకం ఉంది. సరికొత్త కంటెంట్‌తో రూపొందుతున్న ఈ వెబ్ సీరిస్ ద్వారా మా ఫ్యామిలీ నుంచి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా మారుతున్నారు. ఇక హరీశ్‌శంకర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్‌గా తనకంటూ టాలీవుడ్లో ప్రత్యేక మార్క్ వేసుకున్నాడు. ఈ వెబ్సిరీస్ని తనతో కలిసి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. ఈ వెబ్‌సిరీస్‌కి సినిమాటోగ్రఫీ : పీజీ విందా, సంగీతం : ప్రశాంత్ విహారి, దర్శకత్వం : సి. చంద్ర మోహన్.