Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్కీ మీడియా.. ఈ బ్యానర్ గురించి తెలియని వారుండరు. మంచి కంటెంట్ సినిమాలకు, వాటి సక్సెస్‌లకు కేరాఫ్‌గా నిలిచిన ఈ బ్యానర్లో పని చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దర్శకులు కావాలనుకునే వారు, హీరో, హీరోయిన్లుగా తామేంటో నిరూపించు కోవాలని అనుకున్న వాళ్ళు కచ్చితంగా ఈ బ్యానర్లో తమ లక్‌ని పరీక్షించుకుంటారనటంలో అతిశయోక్తి లేదు. ఈ బ్యానర్ అధినేతగా, అభిరుచిగల నిర్మాతగా బెక్కెం వేణుగోపాల్ అందరి వాడుగా టాలీవుడ్లో మంచి పేరు సొంతం చేసుకున్నారు. గత 16 సంవత్సరాలుగా అప్రహాతితంగా సినిమాలను నిర్మించడమే కాకుండా సక్సెస్ఫుల్ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. నేడు (బుధవారం) ఆయన పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన మంగళవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, 'లక్కీ మీడియా బ్యానర్‌ని స్థాపించి నిర్మాతగా ఇది నా 16వ సంవత్సరం. 2006 అక్టోబర్ 12న నా మొదటి సినిమా రిలీజైంది. ఈ పదహారు సంవత్సరాల సక్సెస్ఫుల్ జర్నీకి నా మొదటి సినిమా 'టాటా బిర్లా మధ్యలో లైలా..' సినిమా విజయం ఇచ్చిన ఎంకరేజ్ మెంటే కారణం. ప్రొడక్షన్ మేనేజర్‌గా వచ్చి ప్రొడ్యూసర్ అయ్యాను. హీరో శివాజీ గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయన సహకారంతో 'టాటా బిర్లా..' సినిమాతో నిర్మాతగా మారాను. ప్రొడ్యూసర్‌గా బోల్డెన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రతి సంవత్సరం సినిమాలు తీయటం గ్రేట్ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతటి సంతృప్తికర ప్రయాణానికి నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ వెన్నెముకగా నిలిచారు. పాండమిక్ టైంలో కూడా 'పాగల్' సినిమాని రిలీజ్ చేశాను. అందరి సపోర్ట్‌తోపాటు ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరించి, మంచి విజయాన్ని అందించారు. నా కెరీర్లో ఈ సినిమా సక్సెస్ చాలా ప్రత్యేకమైంది. ప్రస్తుతం 'అల్లూరి' సినిమా ఫైనల్ స్టేజ్‌కి వచ్చింది. అలాగే 'బూట్ కట్ బాలరాజు' సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉంది. వీటితోపాటు కొన్ని కథలను ఓకే చేసి, ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నాం. కథ, ఆర్టిస్టులు ఎంపిక, సినిమా బిజినెస్ అన్నింటిలోనూ అనుభవం ఉంటేనే అతను పర్ఫెక్ట్ నిర్మాత అవుతాడని నా అభిప్రాయం. డైరెక్షన్ ఎప్పటికీ చేయను. ఇకపై కూడా నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు కొస్తా.