Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు అడివి శేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో 'మేజర్'గా అడవి శేష్ నటించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించి కొత్త విడుదల తేదీ ఖరారైయింది. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు హిందీ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో ముంబయిలోని తాజ్ హోటల్‌కు ఉగ్రవాదులు నిప్పు పెట్టిన విజువల్ బ్యాక్‌డ్రాప్‌లో నుదిటిపై గాయంతో ఉన్న అడివిశేష్ కనిపిస్తున్నారు. ఉగ్రవాదులపై సాధించిన విజయానికి ప్రతీకగా మన జాతీయ జెండా రెపరెపలాడుతోంది. ఈ పోస్టర్ అందర్నీ ఎంతగానో అలరిస్తోంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
'ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'హదయం..' సంగీత ప్రియులను ఆకట్టుకుంది. గ్రిప్పింగ్ నేరేషన్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో టీజర్ సైతం అందర్నీ మెప్పించింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో మేజర్ సందీప్ బాల్యం దగ్గర్నుంచి సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబయి దాడిలో వీరమరణం... ఇలా ఆయన జీవితంలోని అపూర్వ సంఘటనలు, ఆయన జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.