Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మే 1వ తేదీన సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాల (24 క్రాప్ట్స్)తో మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ రంగం సిద్ధం చేసింది.
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొల్లి రామకష్ణ, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు ఫెడరేషన్‌కి సంబంధించిన మెంబర్స్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొల్లి రామకష్ణను ఫెడరేషన్ సభ్యులు శాలువాతో సన్మానించారు. అలాగే కార్మిక దినోత్సవం బ్రోచర్‌ని కొల్లి రామకష్ణ, ఈవెంట్ టీ షర్ట్‌లను తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేశారు.
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, 'ఇండిస్టీకి కూడా ఓ పండగ ఉంటుంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్‌గా సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్స్ అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకలకు చిరంజీవిగారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు.
ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కతో పాటు ఏపీకి చెందిన పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పదివేలమంది కార్మికులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొంటారు. కార్మికులకు అండగా మేం ఉన్నామని చాటి చెప్పేలా చాలా గ్రాండ్‌గా జరిగే ఈ వేడుకలో పలువురు స్టార్స్ సైతం పాల్గొనబోతున్నారు' అని తెలిపారు. 'ఫెడరేషన్ ఎప్పట్నుంచో ఈ మే డే వేడుకలు నిర్వహిస్తోంది. అయితే ఎప్పుడు కూడా ఈ వేడుకల్లో యాభై మందికి మించి పాల్గొనలేదు. కానీ ఈ సారి ఫెడరేషన్ కొత్త టీమ్ చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు కార్మికులంతా ఒక్కటే అని స్ఫూర్తి కలిగించే విధంగా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను' అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.