Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం
'జయమ్మ పంచాయితీ'. ఈ చిత్రం ద్వారా యువ జంట దినేష్ కుమార్, షాలినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రంతో విజరు కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా మే 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది.
నిరూపించుకునే అవకాశమిచ్చింది
ఈ సందర్భంగా యువ నాయకా నాయికలు దినేష్ కుమార్, షాలినీ శుక్రవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
దినేష్ కుమార్ మాట్లాడుతూ, 'మాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. బి.టెక్ చదివాక మదర్బోర్డ్ డిజైనర్‌గా జాబ్ చేశాను. అయితే నాకు చిన్నతనం నుండి నటుడిని అవ్వాలనే కోరిక బలంగా వుండేది. 8 ఏండ్లుగా చేస్తున్న కషి ఫలించి, ఏకంగా సుమగారి సినిమాలో అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు విజరుగారు కాస్టింగ్ కాల్ ద్వారా నన్ను ఎంపిక చేశారు. ఆయన కూడా మా ఊరివాడు కావడంతో మా ఇద్దరి మద్య ఫ్రీక్వెన్సీ బాగుంది. ఇందులో సత్య అనే పూజారి పాత్ర పోషించాను. విలేజ్‌లో అల్లరి చిల్లరిగా తిరిగే పూజారి అనిత అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత మా ఇద్దరి ప్రేమకు చిన్న సమస్య వస్తుంది. మరోవైపు జయమ్మకూ ఓ సమస్య ఉంటుంది. ఆమె సమస్యకి, మా సమస్యకూ లింక్ ఉంటుంది. అందేంటో సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో నాకూ సుమగారికి కొన్ని సన్నివేశాలున్నాయి. ఆమెతో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత నా పాత్ర బాగా పాపులర్ అయింది. అందరూ నన్ను గుర్తుపడుతున్నారు. నటుడికి మంచి సినిమాతోపాటు మంచి బ్యానర్ కూడా దొరకడం కూడా లక్కే. నాకు భక్తి ఎక్కువ. మా ఊరిలో కోటదుర్గమ్మని మొక్కుకున్నా. యాదృశ్చికంగా నేను ఏదైతే అనుకున్నానో ఆ పాత్ర దొరకడం, అది కూడా ఆ అమ్మవారి సన్నిధిలోనే షూటింగ్ జరుపుకోవడం చాలా థ్రిల్ అనిపించింది. ఈ సినిమా నటుడిగా నిరూపించుకునే అవకాశం ఇచ్చింది' అని అన్నారు.
నా రియల్ లైఫ్‌కి భిన్నమైన పాత్ర చేశా
షాలినీ మాట్లాడుతూ,'సినిమాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే తమిళ షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్ యాడ్స్‌లో కూడా నటించా. ఈ సినిమాకు పనిచేస్తున్న రచయిత నన్ను ప్రిఫర్ చేస్తే, దర్శకుడు విజరుగారు ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. బేసిగ్గా నా పాత్ర వేరే ఊరునుంచి శ్రీకాకుళం వస్తుంది. కాబట్టి నాకు ఆ యాస పలికే అవకాశం పెద్దగా రాలేదు. కానీ మిగిలిన పాత్రలన్నీ చక్కగా శ్రీకాకుళం యాసతో ఎంటర్టైన్ చేస్తాయి. నాకు జయమ్మతో పెద్దగా సన్నివేశాలు లేవు. కానీ మా లవ్ స్టోరీకి, జయమ్మకు వచ్చిన సమస్యకూ లింక్ ఉంటుంది. శ్రీకాకుళం, ఆముదాలవలస, పాలకొండ, కోటిపల్లి వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. లొకేషన్లు చాలా అందంగా ఉన్నాయి. ఇందులో నా రియల్ లైఫ్‌కి వ్యతిరేకమైన పాత్ర పోషించాను. నా పాత్ర అందరూ మెచ్చుకునేలా ఉంటుంది. నటిగా నాకు గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నాను. సుమలాంటి ఆల్‌రౌండర్‌తో కలిసి సినిమాకి పని చేయటం ఎంతో సంతోషంగా ఉంది. నటీనటులుగా మా ఇద్దరినీ అందరూ గుర్తు పడుతున్నారంటే అందుకు కారణం జయమ్మే. అందరూ చూడదగ్గ మంచి సినిమ ఇది' ' అని చెప్పారు.