Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'సమ్మతమే'. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు.
యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, 'ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే విడుదలైన రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. మా యూజీ ప్రొడక్షన్స్ ద్వారా వస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది. ఓ వినూత్న కథతో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది. ముఖ్యంగా మా నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంట అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. వీరిద్దరి పాత్రలు చాలా బాగా వచ్చాయి. మా దర్శకుడు ఈ చిత్ర కథని వెండితెరపై అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మా చిత్రాన్ని జూన్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం' అని తెలిపారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి, నిర్మాత: కంకణాల ప్రవీణ, సంగీతం: శేఖర్ చంద్ర, డీవోపీ: సతీష్ రెడ్డి మాసం, ఎడిటర్: విల్పవ్ నైషదం, ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల.