Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు హీరోగా వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'భళా తందనాన'. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించి కొత్త విడుదల తేదీ ఖరారైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం వినూత్నంగా ప్రమోషన్ చేసేందుకు ప్లాన్ చేశారు.
'కెరీర్ ప్రారంభం నుంచి శ్రీ విష్ణు ఎంచుకునే పాత్రలు, సినిమాలు ఎలా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఓ సినిమా అంగీకరించారంటే కచ్చితంగా అది రెగ్యులర్ సినిమాలా ఉండదనే ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన పంథాలోనే ఈ సినిమా, ఈ సినిమాలోని ఆయన పాత్ర ఉంటుంది. మా దర్శకుడు చైతన్య దంతులూరి ఈ చిత్ర కథని బాగా హ్యాండిల్ చేశారు. ఆయనకు ఈ సినిమాతో దర్శకుడిగా మరింత మంచి పేరు రావడం ఖాయం. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని మొదటి, రెండు లిరికల్ వీడియోలకు మంచి స్పందన లభించింది. టీజర్ సైతం అన్ని వర్గాల ప్రేక్షకులుని ఆకట్టుకుని, సినిమాపై అంచనాలు పెంచింది. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెస్సా కథానాయికగా ఓ మంచి పాత్ర పోషించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే మా చిత్రాన్ని మే 6న విడుదల చేస్తున్నాం' అని మేకర్స్ చెప్పారు.
రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్, డీవోపీ - సురేష్ రగుతు, స్టంట్స్: పీటర్ హెయిన్, ఆర్ట్ - గాంధీ నడికుడికార్, రచన - శ్రీకాంత్ విస్సా.