Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా రూపొందిన చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. విద్యాసాగర్ చింతా దర్శకుడు. 'రాజాగారు రాణివారు' డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈనెల 6న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నాయిక రుక్సార్ థిల్లాన్ శనివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాలో నేను నటించటానికి ముఖ్య కారణం మాధవి పాత్ర. గతంలో చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటడంతో సెకండ్ థాట్ లేకుండా గ్రీన్‌సిగల్ ఇచ్చా. ఎక్కువ డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతోనే నటించటం నాకు పెద్ద ఛాలెంజింగ్‌గా అనిపించింది. కేవలం హావభావాలతోనే పవర్‌ఫుల్‌గా మన ఎక్స్‌ప్రెషన్‌ని ఎలా చెప్పగలమో ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు బాగా అర్థమైంది. మాధవిగా గుర్తుండిపోతాను. పెళ్ళీడు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. హీరో విశ్వక్సేన్ మంచి ఎనర్జిటిక్. చాలా డెడికేటెడ్‌గా పని చేస్తారు. విద్యాసాగర్ తాను ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో చాలా స్పష్టంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ హ్యాపీగా చూసి, ఎంజారు చేసే సినిమా ఇది. నేను దర్శకుడు సుకుమార్ సినిమాలకు అభిమానిని. ఛాన్స్ వస్తే ఆయన సినిమాల్లో నటించాలని ఉంది' అని తెలిపారు.