Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇప్పుడు స్టార్స్ అందరూ తమన్ మ్యూజిక్ కావాలని అడగటం మీకు గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే దీన్ని నేను గోల్డెన్ పీరియడ్‌గా భావించడం లేదు. వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకం అని ఫీలవుతున్నాను. వాళ్ళ ట్రస్ట్‌కి తగ్గట్టు కష్టపడి పని చేయాలి. ఇదే నా ముందు ఉన్న లక్ష్యం' అని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు. మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్ మెంట్, 14 రీల్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ శనివారం మీడియాతో మాట్లాడారు.
మేం ఎన్ని ట్యూన్స్ అయిన చేయడానికి రెడీగా ఉంటాం. అయితే అది కథకు సరిపొతుందా లేదా? అనేది ముఖ్యం. దర్శకుడు ఎంతో కాలం కష్టపడి ఒక కథని రెడీ చేసుకుంటాడు. కథని లిరికల్‌గా చెప్పడానికి పాట కూడా కావాలి. ఇప్పడు కథలో నుంచి వచ్చే పాటలే ఎక్కువ.
ఈ సినిమాలో 'కళావతి' పాట కథలో నుంచి వచ్చిందే. చాలా రోజుల తర్వాత ఒక మెలోడి పాటకు థియేటర్ స్టేజ్ ఎక్కి ఆడియన్స్, మహేష్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తారు. అంత అద్భుతంగా ఉంటుందీ ఈ పాట.
2020 లాక్డౌన్లో చేసిన పాట ఇది. నేను, దర్శకుడు పరశురాం గారు, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైను. నాకు 'సామజవరగమనా', దర్శకుడు పరశురాంకి 'ఇంకేం ఇంకేం కావాలె' లాంటి మెలోడియస్ ఉన్నాయి. మహేష్ గారు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది. చాలా ప్యూర్‌గా డిజైన్ చేయాలనీ ముందే అనుకున్నాం. అలా కళావతి పాటతో కంపోజింగ్ స్టార్ట్ చేశాం. ఫాస్టెస్ట్‌గా 150 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి అందరినీ అలరించింది.
ఇక రెండో సాంగ్ 'పెన్నీ' కూడా హిట్ అయ్యింది. ఇందులో మహేష్‌గారి తనయ సితార స్టెప్స్ అందర్నీ మెస్మరైజ్ చేశాయి. దీని తర్వాత రిలీజైన టైటిల్ సాంగ్ అదరగొట్టింది. మహేష్‌గారి పాత్రని బాగా ఎలివేట్ చేసే సాంగ్ ఇది. ఈ టైటిల్ సాంగ్ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు మహేష్ గారికి 'దూకుడు', 'ఆగడు', 'బిజినెస్ మ్యాన్' సినిమాలు ఉన్నాయి. వాటి టైటిల్ సాంగ్స్‌కి మించి ఈ పాట ఉండాలి. ఫైనల్‌గా అదిరిపోయే అవుట్‌ఫుట్ వచ్చింది. అలాగే ఈ సినిమా నుండి రాబోతున్న మరో రెండు మాస్ సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.
ఈ సినిమాలో మ్యూజిక్ కంప్లీట్ అర్బన్‌గా ఉంటుంది. దర్శకుడు పరశురాం గారితో 'ఆంజనేయులు', 'శ్రీరస్తు శుభమస్తు' చేశా. ఇది ఆయనతో మూడో సినిమా. ఆయనతో పని చేయడం అలవాటే. అయితే ఆయన చేసిన 'గీత గోవిందం' ఆడియో పరంగా పెద్ద హిట్. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అన్నిటికంటే మహేష్ గారి సినిమా అంచనాలు అందుకోవడం పెద్ద ఛాలెంజ్. మహేష్ గారి ఫ్యాన్స్ సినిమా కోసం రెండేళ్ళుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుంది.
రామ్ చరణ్, శంకర్ సినిమా ఒక పాట, చిరంజీవి గారి 'గాడ్ ఫాదర్' ఒక పాట బ్యాలెన్స్ ఉన్నాయి. విజరుతో చేస్తున్న సినిమాకి మూడు పాటలు, బాలకష్ణగారి సినిమా కోసం ఒక పాట రికార్డ్ చేశాం. బాలీవుడ్ సినిమాలకు పని చేసే అవకాశాలొస్తున్నాయి. వీటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
ఫిల్మ్ మ్యూజిక్‌ని ఇంటర్నేషనల్‌గా తీసుకెళ్ళాలన్నది నా లక్ష్యం. తెలుగు సినిమా పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళింది. దీంతో మ్యూజిక్ విషయంలో అందరికీ మరింత బాధ్యత పెరిగింది. మ్యూజిక్‌లో మరిన్ని మార్పొలొస్తాయి కూడా.