Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'ఎఫ్3'. ప్రేక్షకుల విశేష ఆదరణతో ఘన విజయం సాధించిన 'ఎఫ్2' చిత్ర ఫ్రాంచైజీగా వస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు దీటుగా ఈనెల 27న విడుదలవ్వబోతున్న ఈ సినిమా ఉంటుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'దర్శకుడు అనిల్ రావిపూడి సష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా అలరిస్తుంటాయి.
ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచిన పాత్రల్లో బ్లాక్ బస్టర్ హిట్ 'ఎఫ్2'లో మెహ్రీన్ పిర్జాదా చేసిన హానీ పాత్ర.
హనీ మేనరిజం, అమాయకత్వం, అల్లరి
ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి. 'ఎఫ్2' లో
హనీ పాత్రకు భిన్నంగా, 'ఎఫ్2'కి మించిన వినోదం 'ఎఫ్3'తో పంచబోతున్నారు మెహ్రీన్.
ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇందులో మెహ్రీన్ పాత్రని మెచ్యూర్ అండ్ డిఫరెంట్ లేయర్స్ ఉన్న పాత్రగా, పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు. ఈ పాత్ర తన కెరీర్లోనే ది బెస్ట్ ఎంటర్టైన్ రోల్ కాబోతుందని మెహ్రీన్ నమ్మకంగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ ఇది. వెంకటేష్‌కి జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటిస్తుండగా, సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్గా అలరించనుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'ఎఫ్3' థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అలాగే సెకెండ్ సింగిల్ 'వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా' పాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుని ట్రెండింగ్‌లో ఉంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో సందడి చేయబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో అలరించనున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది' అని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, నిర్మాత : శిరీష్, సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, డీఓపీ : సాయి శ్రీరామ్, ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్, ఎడిటర్ : తమ్మి రాజు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : ఎస్ కష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్.
'ఎఫ్2'లో నేను చేసిన హనీ పాత్ర అంత బాగా పేలుతుందని నేను ఊహించలేదు. దర్శకుడు అనిల్ రావిపూడిగారు అద్భుతంగా హనీ పాత్రను డిజైన్ చేశారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా.. 'హనీ ఈజ్ ది బెస్ట్' అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఇక 'ఎఫ్3'లోనూ నా పాత్ర మరింత వినోదాన్ని అందించేలా ఉంటుంది. బాగా ఎంజారు చేస్తారు.
- మెహ్రీన్