Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం 'సమ్మతమే'. గోపీనాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవు తున్నారు. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర టీజర్‌ను రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఎం.ఎల్.ఎ.రవీందర్ కుమార్ రావత్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, 'ఈ సినిమాలోని కష్ణ సత్యభామ, బుల్లెట్లా సాంగ్ మంచి ఆదరణ పొందాయి. మా టీమ్ మంచి సినిమా తీయాలనే తపనతో పనిచేశాం. టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. అందరూ అదుర్స్ అంటుంటే సినిమా ఫలితంపె మరింత నమ్మకం పెరిగింది. జూన్ 4న థియేటర్లలో మా సినిమాని చూసి అందరూ ఎంజారు చేయండి' అని అన్నారు.