Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడే సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని కోట్ల విజరు భాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నిర్వహించిన సినీ కార్మికోత్సవం అద్యంతం వైభవంగా సాగింది.
ఈ కార్యక్రమంలో చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, అలీ, సి.కల్యాణ్, గద్దర్, నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, 'సినీ కార్మికులందరూ చేసుకుంటున్న పండగకు నన్ను ఆహ్వానించిన ఫెడరేషన్‌కు ధన్యవాదాలు. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినీ పరిశ్రమలో ఎవరి దారి వారిదే అవడం వల్ల ఇంతకు ముందు ఇలాంటి మేడేను జరుపుకోలేదు. నేనూ కార్మికుడినే. ఎవరికి ఏ కష్టమొచ్చినా వారి వెనకే ఉంటా. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలి. చిత్ర పరిశ్రమ అభివద్ధికి ప్రభుత్వ సహకారం కావాలి. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిశ్రమకు ఎంతో భరోసా ఇచ్చారు. సినీ పరిశ్రమ కోసం ఎంతోమంది తమ కుటుంబాలను త్యాగం చేశారు. వీళ్ళు సినీ కళాకారులు కాదు.. సినీ కార్మికులు అని రావుగోపాలరావుగారు ఎన్నో సందర్భాల్లో అన్నారు. కార్మికులకు అండగా ఉంటా' అని తెలిపారు.
గుడ్ల ధనలక్ష్మీ ట్రస్ట్ ద్వారా గుడ్ల ధనలక్ష్మీ 5 లక్షల రూపాయలు చెక్కును తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌కి చిరంజీవి గారి చేతుల మీదుగా అనిల్ వల్లభనేని, దొరై, సురేష్‌కు అందజేశారు.