Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది 'జయమ్మ పంచాయితీ' ప్రీ రిలీజ్‌లా లేదు. ఇక్కడొక పండుగలా ఉందని వేడుకకు హాజరైన అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి అక్కినేని నాగార్జున అన్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా, విజరు కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 6ననీ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి 'జయమ్మ కంప్లయింట్' అనే పేరుతో 'జయమ్మ పంచాయితీ' ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, 'పంచాయతీ అంటే నేను రాలేదు. ప్రేమతో సుమ పిలిస్తే వచ్చాను. ఈ సినిమా టీమ్ అంతా సుమలోని టాలెంట్‌లో 10 శాతం పెట్టినా పెద్ద హిట్ అవుతుంది' అని చెప్పారు.
'సుమ నటించిన సినిమాకు మేం గెస్ట్‌గా రావడం కొత్తగా ఉంది. మనందరి ఇంటిలో మనిషిగా సుమగారు అయ్యారు. ఇండిస్టీకి ఆమె చాలా చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూశాక, స్టేజీ మీదే కాదు వెండితెరపై కూడా అలరించిందనిపించింది. కీరవాణి సంగీతం తోడై, సినిమా చూడాలనే ఆసక్తి నెలకొంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని, సుమగారు మరిన్ని సినిమాలతో బిజీ కావాలని ఆశిస్తున్నాను' అని హీరో నాని అన్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ, 'నిర్మాత బలగా ప్రసాద్‌కు బి.పి. పెరిగినట్లుగా వసూళ్ళు రావాలి ( నవ్వుతూ). అందరూ సినిమా చూసి ఆదరించాలి. అందం, తెలివితేటలు, మంచి మనసు ఉన్న సుమగారికి రాజీవ్ కనకాల (ఆర్.కె.) ఉంటే చాలు' అని తెలిపారు.
'ఏదో చిన్న కథతో సినిమా తీయాలనుకున్న నాకు సుమగారు ఈ కథలోకి రావడం, ఆ తర్వాత సినీప్రముఖులు ప్రమోషన్‌కు సహకరించడం అదష్టంగా భావిస్తున్నా. సుమగారి నటన గురించి వర్ణించలేం. కీరవాణిగారి సంగీతం మా చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది' అని దర్శకుడు విజరు తెలిపారు.
నా ఈ స్థాయికి కారణం మీ చప్పట్ల వల్ల వచ్చిన ఎనర్జీనే. మన ఇంటిలోని అమ్మాయిగా భావించడం హ్యాపీగా ఉంది. దర్శకుడు, నిర్మాత, నటీనటులతో పాటు కీరవాణి గారి సంగీతంతో మా సినిమాకు బలం చేకూరింది. నాకు శ్రీకాకుళం యాస రాదు. కానీ నాకు నేర్పించిన టీమ్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాకు రామ్‌చరణ్, నాని, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడం వల్లే హైప్ వచ్చింది. సినిమా విడుదలకు సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సునీల్‌గారు సహకారం ఎంతో ఉంది. ఆల్ హీరో ఫ్యాన్స్ నా సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మహేష్‌బాబుగారు ఈనెల 3న కొత్త ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు.
- సుమ