Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి అద్భుతమైన సాహిత్యం అందించిన గీత రచయిత అనంత శ్రీరామ్ ఆదివారం మీడియాతో ముచ్చటించారు.
'పదిహేడేళ్ళ జర్నీ.. 1295 పాటలు రాశా. పాటకు మించిన పాట ఇస్తేనే ఇక్కడ రచయితగా నిలబడగలం. దీనికి నిదర్శనమే 'గీత గోవిందం' సినిమాలో 'ఇంకేం ఇంకేం..' పాట. అప్పుడప్పుడే వ్యూస్ లెక్కపెడుతున్న సమయంలో వంద మిలియన్స్ దాటి రికార్డ్ సష్టించింది. దాన్ని మించిన విజయం మూడేళ్ళ తర్వాత ఈ సినిమాలోని 'కళావతి..' సాంగ్తో వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని ఐదు పాటలు డిఫరెంట్ జోనర్లో ఉంటాయి. 'పెన్నీ..' సాంగ్ హీరో కారెక్టరైజేషన్కి సంబధించి ఉంటుంది. రూపాయి ఎవరిదైనా సరే దాన్ని గౌరవించే క్యారెక్టర్ హీరోది. దీన్నే మాస్ ధోరణిలో 'పెన్నీ' సాంగ్లో చెప్పాం. 'కళావతి..' ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. ఎంతటి పోగరబోతు కూడా అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ప్రాధేయపడి, ఆమె ప్రేమని కోరుతాడనేది ఈ పాటలో అందంగా చెప్పాం. ఇక టైటిల్ సాంగ్ పూర్తి కమర్షియల్గా ఉంటుంది. 'సర్కారు వారి పాట వెపన్స్ లేని వేట..' అయితే వేటాడాలంటే ఆయుధం కావాలి. కానీ హీరో ఆయుధం అతని తెలివి. భిమానులను కచ్చితంగా అలరిస్తాయి. 'గాడ్ ఫాదర్', రామ్ చరణ్ - శంకర్ గారి సినిమా, నాగ చైతన్య 'థ్యాంక్ యూ' చిత్రాలకు ప్రస్తుతం రాస్తున్నాను. ఇవి కాకుండా నవదీప్ హీరోగా 'లవ్ మౌళి', సత్యదేవ్ 'కష్ణమ్మ' చిత్రాలకు సింగిల్ కార్డ్ రాస్తున్నాను. అలాగే ఎస్వీ కష్ణా రెడ్డిగారి కొత్త సినిమాకీ పాటలు రాస్తున్నాను' అని అనంత శ్రీరామ్ చెప్పారు.