Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన ప్రతిభను ప్రోత్సహించటానికి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను హీరో నాని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనితో కలిసి తొలి చిత్రంగా 'అ!' సినిమాను రూపొందించి విజయం అందుకున్నారు. రెండో చిత్రంగా 'హిట్' అనే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో మరో హిట్ దక్కించుకున్నారు. లేటెస్ట్గా 'హిట్' సినిమాకు ఫ్రాంచైజీగా 'హిట్ 2 ద సెకండ్ కేస్' చిత్రాన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
'హిట్' సినిమాతో ఆడియెన్స్‌ని మెప్పించిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని జూలై 29న విడుదల చేస్తున్నట్లు సోమవారం మేకర్స్ ప్రకటించారు.
'క్షణం, ఎవరు, గూఢచారి' వంటి చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. ఆయన ఇందులో కష్ణ దేవ్ అలియాస్ కె.డి పాత్రలో మెప్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన లేడీ పోలీస్ ఆఫీసర్ మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడనే కాన్సెప్ట్‌తో 'హిట్' సినిమాను రూపొందిస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందిన 'హిట్' టీమ్ ఆఫీసర్ కష్ణ దేవ్ అలియాస్ కె.డి ఓ ఎగ్జైటింగ్ జర్నీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మీనాక్షి చౌదరి, రావు రమేష్, భాను చందర్, పోసాని కష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సమర్పణ: నాని, నిర్మాత: ప్రశాంతి త్రిపిర్నేని, రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను, సినిమాటోగ్రఫీ: మణికందన్.ఎస్, జాన్ స్టీవర్స్ ఎడురి, ఆర్ట్: మనీషా ఎ.దత్, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్.