Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ హీరో విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం 'అల్లంత దూరాన'. ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ కథానాయిక. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్.క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్.చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోని 'రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే గువ్వల గుంపే మనమైపోదాం' అంటూ హుషారుగా సాగే ఓ యూత్ ఫుల్ పాటను హైదరాబాద్‌లోని ఎం.వి.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీలో వేలాది మంది స్టూడెంట్స్ సమక్షంలో విడుదల చేశారు.
ఈ పాటకు రాంబాబు సాహిత్యాన్ని అందించగా, రథన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ, 'సమష్టి కషితో చాలా మంచి సినిమా తీశారు. యూత్ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం' అని అన్నారు.
'వాస్తవానికి దగ్గరగా మీ స్టూడెంట్స్ అందరి జీవితంలో జరిగే విషయాలే ఈ చిత్రంలో ఉంటాయి. పాటలన్నీ అలరిస్తాయి. రథన్ సంగీతం వీనుల విందుగా ఉంటుంది. ఈ నెలలోనే మా సినిమాని విడుదల చేస్తాం' అని నిర్మాత ఎన్.చంద్రమోహనరెడ్డి తెలిపారు. దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, 'స్క్రీన్ పై మిమ్మల్ని మీరే చూసుకున్న భావనతో ఈ చిత్రం ఉంటుంది. సినిమాలో పాటలన్నీ వేటికవే హైలైట్‌గా ఉంటాయి' అని అన్నారు. 'కళ్లతో రొమాన్స్‌ను వ్యక్తం చేస్తూ ఓ మధురానుభూతిని కలిగించే విధంగా ఈ చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది' అని హీరో విశ్వ కార్తికేయ తెలిపారు.