Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన దేశంలోనే తొలిసారి 'మా ఇష్టం' సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని ఈనెల 6న రిలీజ్ చేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ మంగళవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ కోసం 'ఆర్జీవీ.. ఆస్క్ ఎనీథింగ్' అనే కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ, చిత్రంలో లీడ్ రోల్స్ పోషించిన నైనా గంగూలీ, అప్సర రాణి పాలొన్నారు. లెస్బియన్ శంగారం విషయమై పలువురు స్టూడెంట్స్, రాముయిజం ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు వర్మ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ సినిమా ఓ డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని ఆయనన్నారు. ఇది మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమ కథ. స్త్రీ, పురుషుని మధ్య ప్రేమ, లైంగిక వాంఛ ఎలా అయితే ఉంటాయో వీరి మధ్య కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ మాత్రమే. దానికి లింగబేధంతో ఎలాంటి సంబంధం లేదని వర్మ చెప్పారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా టి. రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.