Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. 'రాజాగారు రాణివారు' డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈనెల 6న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 'అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది. ముఖ్యంగా పెళ్ళీడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుందనేది మాటల్లో కంటే సిల్వర్ స్క్రీన్‌పై చూస్తేనే మాజా ఉంటుంది' అని తెలిపారు. 'ఈ సినిమాలో మంచి పాత్ర లభించడం చాలా సంతోషంగా ఉంది. నా పాత్ర దర్శకుడు చాలా బాగా డిజైన్ చేశారు. కోవిడ్ తర్వాత నాకు మంచి కమ్‌బ్యాక్ సినిమా' అని నాయిక రుక్సార్ థిల్లాన్ చెప్పారు.
దర్శకుడు విద్యాసాగర్ చింతా మాట్లాడుతూ, 'గతంలో విశ్వక్‌తో 'వెళ్ళిపోమాకే' సినిమా చేశా. ఆయన ఎలాంటి పాత్ర అయినా సరే చేయగలడు. ఈ సినిమాలో విశ్వక్ కనిపించడు. కేవలం ఆయన పోషించిన అల్లం అర్జున్‌కుమార్ పాత్రే కనిపిస్తుంది. ఈ సినిమాతో విశ్వక్ ఇమేజ్ మారిపోతుంది. ఇంత మంచి అవుట్‌ఫుట్ రావడానికి కారణమైన నిర్మాతలకు థ్యాంక్స్. కథ, కథనం, మాటలు, పాటలు, పాత్రల నటన..హైలైట్‌గా ఉంటాయి. ఈ సినిమా కచ్చితంగా అందర్నీ అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని అన్నారు.