Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు, పరశురాం కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'ఈ సినిమాలో 'కళావతి', 'పెన్నీ', ఇంకో మాస్
సాంగ్ చేశా. 'కళావతి', 'పెన్నీ' సాంగ్స్ ఇప్పటికే విజయాలు సాధించాయి.
రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్‌కు గొప్ప ట్రీట్ ఇస్తుంది. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. త్వరలో రాబోయే మాస్ సాంగ్ కూడా అదిరిపోతుంది. మహేష్ గారితో 'సరిలేరు నికెవ్వరు'లో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్ సాంగ్స్ చేశా. ఈ సినిమాలో మూడు పాటలు ఆయనతో చేయటం ఆనందంగా ఉంది. డాన్స్ మూమెంట్స్‌ని ఆయన చాలా త్వరగా నేర్చుకుంటారు. ఆయనలో అద్భుతమైన రిథమ్ ఉంది. 'కళావతి' పాటని అందరూ రీల్స్ చేశారు. ఈ పాటలో మహేష్-సితార ఇద్దరూ బాగా చేశారు. సితార పాపలో గొప్ప గ్రేస్ ఉంది. ఒక కొరియోగ్రాఫర్‌గా చిరంజీవి గారికి, ప్రభు మాస్టర్‌కి చేయాలనుకున్న టార్గెట్ రీచ్ అయ్యింది. అలాగే రాజమౌళిగారితో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి చేయాలని ఆశ పడుతున్నా. ప్రస్తుతం కోలీవుడ్‌లో శింబు, శివకార్తికేయన్ సినిమాలు, బాలీవుడ్ విషయానికి వస్తే గతంలో ప్రభుదేవా మాస్టర్ సినిమాలు చేశాను. తెలుగులో చిరంజీవిగారు, మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ గారి 'ధమాకా' సినిమాలకి కొరియోగ్రఫీ అందిస్తున్నా' అని తెలిపారు.