Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎఫ్2'లో పెళ్ళి, తర్వాత వచ్చే కష్టాలతో వినోదాత్మకంగా చూపించాం. 'ఎఫ్ 3' మాత్రం డబ్బు చుట్టూ తిగిరే కథ. డబ్బుతో మానవ సంబంధాలు ఎలా ముడిపడి ఉన్నాయనే పాయింట్‌ని
ఆద్యంతం వినోదాత్మకంగా చూపించబోతున్నాం' అని ఎడిటర్ తమ్మిరాజు చెప్పారు.
వెంకటేష్, వరుణ్‌తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున చిత్రం 'ఎఫ్3'. ఈనెల 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఎడిటర్ తమ్మిరాజు మీడియాతో ముచ్చటించారు.
ఆ విశేషాలు ..
నేను పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. అందులో దర్శకుడు రాజమౌళి గారితోనే 18 ఏళ్ళు ప్రయాణం చేశాను. 'శాంతి నివాసం' సీరియల్ నుంచి బాహుబలి 2 వరకూ రాజమౌళిగారితో పని చేశాను.
దర్శకుడు అనిల్ రావిపూడిగారితో 'పటాస్' నా ఫస్ట్ మూవీ. తర్వాత ఆయన సినిమాలన్నీ చేశాను. ఇప్పటివరకూ దాదాపు 30 సినిమాలకు ఎడిటర్‌గా చేశాను.
దాదాపు ఇరవై ఏండ్ల కెరీర్లో కొరటాల శివగారి 'మిర్చి' సినిమాకి అసోసియేట్ ఎడిటర్‌గా పని చేసినప్పుడు, అనిల్ రావిపూడి 'పటాస్'కి ఎడిటర్‌గా పని చేసినప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. 'ఎఫ్3'లాంటి కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అనిల్‌గారి సినిమాల్లో కామెడీ పంచ్లన్ని బాగుంటాయి. దానిలో ఏది ట్రిమ్ చేయలన్నా కష్టంగా ఉంటుంది.
ఈ సినిమా రష్ చూశాక సూపర్ హిట్ అనిపించింది. వెంకటేష్, వరుణ్‌తేజ్‌తోపాటు అందరూ బాగా ఎంటర్టైన్ చేస్తారు. దిల్‌రాజుగారికి సినిమా అంటే ప్రేమ. అనిల్‌గారితో పని చేయటం చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 'బింబిసార', మైత్రి మూవీ మేకర్స్ సినిమా, నాగశౌర్య 'కష్ణ వ్రింద విహారి' సినిమాలు చేస్తున్నా.