Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుధవారం దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా దాసరి ఫిల్మ్ అవార్డ్స్ పేరిట ఏబీసి ఫౌండేషన్, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ పరిశ్రమలోని 24 క్రాప్స్ట్ టెక్నీషియన్లకి అవార్డ్స్ అందించడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలు సి.కళ్యాణ్, టి. రామసత్యనారాయణ, అచ్చిరెడ్డి, డైరెక్టర్స్ రేలంగి నర్సింహరావు, ఎస్వీ కష్ణారెడ్డి, హీరో సుమన్ అతిథులుగా ఈ వేడుకలో పాల్గొని దర్శకరత్న దాసరిది స్ఫూర్తిదాయక ప్రయాణమని, తరతరాలకు ఆయన మార్గదర్శి అని కితాబిచ్చారు.
ఈ సందర్భంగా స్టంట్,ఫైట్స్ విభాగానికి చెందిన సభ్యులు మాట్లాడుతూ,'మేం ఆఫ్ స్క్రీన్‌లో పడే కష్టాన్ని దాసరి ఫిల్మ్ అవార్డ్స్ వారు గుర్తించడం మా అదష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే హీరోలకి, డైరెక్టర్లకి, నిర్మాతలకు అవార్డ్స్ ఇచ్చారు. కానీ వారు అలా కనిపించడానికి కష్ట పడేది మాలాంటి కార్మికులే. మేం చేసే యాక్షన్ ఎపిసోడ్స్‌కి ఒక్కో సారి ప్రాణాలకు సైతం రిస్క్ ఉంటుంది. అలాంటి మా క్రాఫ్ట్స్‌ని గుర్తించి ఇలా అతిథుల సమక్షంలో అవార్డ్స్ ఇవ్వడం మాకు పద్మశ్రీ అవార్డ్స్ పొందినంత తప్తిగా ఉంది' అని చెప్పారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులతోపాటు సామాజిక వేత్తలు, నాటక రంగం, పంపిణీ రంగం, సేవ రంగాల్లో ఉన్న పలువురికి దాసరి జీవన సౌఫల్య అవార్డ్స్‌ని కార్యక్రమ నిర్వాహకులు అందజేశారు.