Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా, విజరు కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈనెల 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బలగ ప్రకాష్ సినిమా గురించి మాట్లాడుతూ, 'మా శ్రీకాకుళం, టెక్కలి పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభించింది. 300 మందితో బైక్ ర్యాలీ, 500 మందితో 'జయమ్మ' జెండాలతో ఆకట్టుకునే ప్రచారం చేశాం. దర్శకుడు కథ చెప్పినప్పుడు జయమ్మ పాత్రకు సుమగారి పేరు నేనే చెప్పాను. సుమగారు కాకపోతే సినిమా చేయనని చెప్పేశాను. మా శ్రీకాకుళంలో ఉన్న లోకల్ నటీనటులకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం, అలాగే ఇక్కడ అందమైన లొకేషన్లలో షూటింగ్ చేయటం ఆనందంగా ఉంది. మా ప్రాంతంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మనుషులు విశాల మనస్కులు. అందుకే వారి పాత్రలు వారే చేస్తే, కథకు మరింత బలం వస్తుందని అనుకున్నాం. అనుకున్నట్లు చక్కటి నటన కనబరిచారు. పవన్ కళ్యాణ్, నాగార్జున, రాంచరణ్, రానా, నాని వంటి హేమాహేమీలు మా సినిమా ప్రమోషన్‌కి మంచి సపోర్ట్ చేశారు. సినిమా కథ విషయానికొస్తే, ఇదొక కావ్యం. ప్రతి మహిళ అంతరంగం. ప్రతి గుండెను తాకుతుంది. కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు వంటి దర్శక దిగ్గజాల చిత్రాల సరసన నిలిచే మానవీయ కవనిక అవుతుంది. మా బ్యానర్ చిరస్థాయిగా చెప్పుకునే చిత్రం అవుతుంది. ఒక్క మాటగా చెప్పాలంటే సుమమ్మని ఇకపై జయమ్మ అని పిలుస్తారు' అని తెలిపారు.