Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'భళా తందనాన' ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి
శ్రీవిష్ణు, క్యాథరిన్ థ్రెసా జంటగా నటించిన చిత్రం 'భళా తందనాన'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. ఈనెల 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకులు రాజమౌళి, శేఖర్ కమ్ముల బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు.
రాజమౌళి మాట్లాడుతూ, ''చైతన్య ప్రతి మూమెంట్లోనూ తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ క్రియేట్ చేశాడు. సస్పెన్స్ రివీల్ చేస్తున్నప్పుడు హైగా ఉండేలా చూసుకున్నాడు. శ్రీవిష్ణు పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. చేప నీటిలోకి ఈజీగా వెళ్ళినట్లు తను కూడా మాస్ పాత్రలోకి షిప్ట్ అయిపోతాడు. తెలుగులో తనకంటూ ఒక జోనర్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఫ్యూచర్ బ్రైట్‌గా కనిపిస్తున్న హీరోల్లో ఒకడు. క్యాథరిన్‌కు మంచి పాత్ర రాశారు. సాయికొర్రపాటిగారు మొదటి నుంచి సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నారు' అని తెలిపారు. 'ట్రైలర్ చాలా బాగుంది. శ్రీ విష్ణు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్న పాత్ర చేశాడు. మణిశర్మ సంగీతం గురించి చెప్పక్కర్లేదు' అని శేఖర్ కమ్ముల అన్నారు.
దర్శకుడు చైతన్య దంతులూరి మాట్లాడుతూ, 'మణిశర్మగారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. సినిమాకు నాలుగు కీలకమైన భాగాలైన రైటింగ్, షూటింగ్, ఎడిటింగ్, సౌండ్ చక్కగా కుదిరాయి. ఈనెల 6న సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చేయండి. శ్రీవిష్ణు మీకు సర్ప్రైజ్ ఇస్తాడు. సరికొత్తగా ఆయన పాత్ర ఉంటుంది. శేఖర్ కమ్ములలోని సెన్సిబులిటీ, రాజమౌళిలోని కమర్షియాలిటీ ఒక్క శాతం ఉండేలా చూసుకున్నాను' అని తెలిపారు.
తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళిగారికి థ్యాంక్స్.
శేఖర్ కమ్ముల గారంటే ప్రత్యేక అభిమానం. సాయిగారు డేరింగ్, డాషింగ్ నిర్మాత. ఇందులో నటీనటులంతా ఇంతకుముందు ఎవరూ చేయని పాత్రలు చేశారు. క్యాథరిన్ కెరీర్లో బెస్ట్ ఫిలిం అవుతుంది. మణిశర్మగారు రీరికార్డింగ్‌తో సర్ప్రైజ్ చేశారు.
చైతన్య, నేను 14 ఏళ్ళుగా స్నేహితులం. ఆయన గురించి సక్సెస్‌మీట్‌లో మాట్లాడతాను. మీ అందర్నీ తప్పకుండా మెప్పించే సినిమా అవుతుంది.
- శ్రీ విష్ణు