Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. 'రాజాగారు రాణివారు' డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 6న సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
'అశోకవనంలో అర్జున కళ్యాణం'.. ఈ టైటిల్ అర్థం ఏంటనేది ఈ జనరేషన్‌కి కచ్చితంగా తెలీయదు. వాళ్ళ పెద్ద వాళ్ళని అడిగితే, దీని అర్థం చెబుతారు. ఇంకా క్లియర్‌గా తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే.
ఇప్పటివరకు నేను 5 సినిమాల్లో యాక్ట్ చేశా. ప్రతీదీ దేనికదే భిన్నం. అలాగే నా పాత్రలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నాకు 'నువ్వు నాకు నచ్చావ్', 'బొమ్మరిల్లు' లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కూడా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే ఈ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చా.
పెళ్ళి కోసం పాట్లు పడే పాత్ర నాది. నా పాత్ర తీరు ఎలా ఉంటుందనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. వినేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయటం చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ చేసేటప్పుడు చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. దర్శకుడు అనుకున్న అవుట్‌ఫుట్ రావడం కోసం నా బెస్ట్ ఇచ్చా.
ఇందులో మహిళలపై వివక్షతోపాటు యాంటీ ఫీమేల్ యాటిట్యూడ్ వంటి సున్నితమైన అంశాన్ని కూడా చూపించబోతున్నాం. ఈ జనరేషన్‌కి సంబంధించి పెళ్ళి విషయంలో ఏం జరుగుతుంది అనే దాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా మా దర్శకుడు అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
మల్టీస్టారర్ చేయాల్సి వస్తే, కమల్‌హాసన్, విజరు సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి వారితో చేస్తాను.
నేను ఏ సినిమా చేసినా అది వినూత్నంగా ఉండాలని ప్రయత్నిస్తా. ఛాన్స్ వస్తే 'బ్రహ్మచారి' సినిమాలో కమల ్హాసన్గారు చేసిన మహిళ పాత్రలాంటి దాన్ని నేనూ చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం 'దాస్ కా దమ్కీ', 'ఓరీ దేవుడో', 'స్టూడెంట్ జిందాబాద్' సినిమాలు చేస్తున్నా. ప్రేక్షకులు, అభిమానుల అండ వల్లే ఈ స్థాయికి వచ్చా. వారి ఆదరణకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.