Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం. చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్‌తో పాటు అక్కడున్న నిశబ్దం కూడా యశోదకు చాలా కొత్త గాను, వింత గానూ అనిపిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినబడుతుండగా, మెల్లిగా వెళ్లి అక్కడున్న కిటికీ తెరిచి చూసింది. తన స్వేచ్ఛే అక్కడ వాలినట్టుగా ఉన్న తెల్లటి పావురాన్ని ఆత్రంగా అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ, అక్కడేం జరిగింది? ఇదంతా 'యశోద' ఫస్ట్ గ్లింప్స్‌లో కనిపిస్తుంది. దీన్ని బట్టే 'యశోద' సినిమా ఎంత వైవిధ్యంగా ఉంటుందో ఊహించుకోవచ్చని అంటున్నారు నిర్మాత శివలెంక కష్ణప్రసాద్.
సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న చిత్రం 'యశోద'. హరి-హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను గురువారం రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కష్ణప్రసాద్ మాట్లాడుతూ, ''ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో సమంతకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. దాన్ని దష్టిలో పెట్టుకుని ఆమె స్థాయి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా చేస్తున్నాం. ఈ సినిమాలో సమంత నటన చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇప్పటికి 80 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఆఖరి షెడ్యూల్ చేస్తున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ ఎత్తున విడుదల చేయనున్నాం' అని చెప్పారు.