Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాజశేఖర్ గారు నటించిన 'అక్క మొగుడు', 'సింహరాశి', 'గోరింటాకు' సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా అలరించాయో ఇప్పుడు వస్తున్న 'శేఖర్' సినిమా కూడా అంతే ఎమోషన్స్‌తో అలరిస్తుంది' అని దర్శకురాలు జీవిత రాజశేఖర్ అన్నారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రమిది.
రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్లో ముత్యాల రాందాస్ ఇండియా వైడ్ విడుదల చేస్తుండగా, నిర్వాణ సినిమాస్ సజన ఎరబోలు ఓవర్సీస్లో విడుదల చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ఏ.ఎం.బి మాల్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో అడవి శేష్ ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకులు పవన్ సాదినేని, నటి ఈషా రెబ్బాతోపాటు చిత్ర యూనిట్ పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హీరో అడవి శేషు మాట్లాడుతూ,''శేఖర్' సినిమా ట్రైలర్ చాలా బాగుంది. రాజశేఖర్ సర్ అంటే నాకు చాల ఇష్టం. ఆయన చేసిన 'మగాడు' నాకు అల్ టైం ఫెవరేట్ సినిమా. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి' అని చెప్పారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ,'మేం ప్రేక్షకులకు చెప్పేది ఒకటే... థియేటర్ వచ్చి సినిమా చూసిన వారు బాగుందంటేనే మా సినిమా చూడండి. ఎందుకంటే మాకు ఈ సినిమాపై అంత నమ్మకం ఉంది' అని చెప్పారు. 'ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. జీవితగారు మంచి కథను సెలెక్ట్ చేసుకుని, తనే దర్శకత్వం వహించి, చాలా చక్కని సినిమా తీశారు. అందుకే నేను ఈ సినిమాను ఇండియా వైడ్‌గా విడుదల చేస్తున్నాను' అని డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాసు తెలిపారు.
ఫ్యామిలీ అందరికి కచ్చితంగా నచ్చ సినిమా ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరూ ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశారు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ
ఆదరించండి.
- దర్శకురాలు జీవితా రాజశేఖర్