Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం 'విరాటపర్వం'. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చేస్తున్నట్లు మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. 1990లో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్నగా, వెన్నెలగా సాయిపల్లవి నటించారు. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర బృందం తెలిపింది.
ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజరుకుమార్ చాగంటి.