Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికీ'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ 'ఎంత చిత్రం'ను ఈనెల 9న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ని సర్ ప్రైజ్ చేస్తుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్లో నాని, నజ్రియా నజీమ్‌లా కెమిస్ట్రీ లవ్లీగా ఉంది. సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. సుందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనుంది.
ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.