Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం దర్శకుడు పరశురాం మీడియాతో సినిమా గురించి పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
మహేష్‌బాబు ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి మెయిన్ రీజన్.. ఈ కథ ఎంత నచ్చిందో, క్యారెక్టర్ డిజైన్ కూడా అంత బాగా ఆయనకు నచ్చింది.ఈ సినిమాని అందరూ 'పోకిరి'తో పోలుస్తున్నారు. 'పోకిరి' ఒక అండర్ కాప్ బిహేవియర్. 'సర్కారు వారి పాట'లో ఒక కామన్ మాన్ బిహేవియర్. ఇందులో ఇంకాస్త ఓపెన్ అవుతారు. మహేష్ మ్యానరిజమ్స్, లుక్స్, బాడీ లాంగ్వేజ్ చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతారు.
ట్రైలర్లో డైలాగులు భలే పేలాయని, అప్పుని ఆడపిల్లతో పోల్చడం, విలన్ దీనికి పూర్తి భిన్నమైన డైలాగ్ చెప్పడం వంటివి చాలా బాగున్నాయని అందరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ డైలాగుల్లోనే ఈ సినిమా అసలు కథ ఉంది. రెండు డిఫరెంట్ మైండ్ సెట్లు మధ్య జరిగే కథ ఇది.
ఈ సినిమాలో బ్యాంకుల టాపిక్ ఉంటుంది. కానీ మహేష్ బ్యాంక్ ఎంప్లాయి కాదు. అలాగే ఈ కథకి విజయ మాల్యకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ కథలో ఒక వ్యక్తి గురించి, వ్యవస్థని ప్రశ్నించడం కానీ వుండదు. మంచి ఉద్దేశంతో రాసుకున్న కథ. సరదాగా ఉంటూ చెప్పాల్సింది బలంగా చెప్పే కథ. మహేష్ నటించిన గత సినిమాల్లో ఉన్నట్టు ఈ సినిమాలో సందేశం ఉండదు. కానీ పర్పస్ ఉంటుంది.
మహేష్, కీర్తిల లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుంది. కీర్తి సురేష్‌ది ఇందులో బలమైన పాత్ర. కథలో చాలా కీలకం. సముద్రఖని పాత్ర ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. ఆయన అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాలో ఆయన పాత్ర ఒక ఎసెట్‌గా ఉండబోతుంది.
ఈ సినిమా ట్రైలర్ చూసి మా గురువుగారు పూరీ జగన్నాథ్ కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పటం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. తమన్ గారు చార్ట్ బస్టర్ ఆల్బం ఇచ్చారు. సౌండ్స్, ట్యూన్స్ కొత్తగాగా డిజైన్ చేశారు. 'కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్. మాస్ పాట అన్ని స్క్రిప్ట్‌లో ఉన్నవే. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా కోసం తమన్ యూనిక్ స్టయిల్లో వర్క్ చేశారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత నాగ చైతన్య హీరోగా 14 రీల్స్ నిర్మాణంలో సినిమా చేయబోతున్నాను.