Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ హీరోగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతుంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ, దివ్యాంశ కౌశిక్‌పై చిత్రీకరించిన 'సొట్టల బుగ్గల్లో' అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది.
'ఈ పాట కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్ అందమైన రొమాంటిక్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ పాటలో రవితేజ, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టు కుంటోంది. రవితేజ స్టైలిష్‌గా కనిపించగా, దివ్యాన్ష చీరకట్టుతో అందంగా కనిపించింది. పాటలో విజువల్స్ లావిష్‌గా ఉన్నాయి. రవితేజ్ చేసిన క్లాసీ డ్యాన్స్ స్టప్స్ కూడా అభిమానులను అలరిస్తున్నాయి. కళ్యాణ్ చక్రవర్తి చక్కని సాహిత్యం అందించగా, హరిప్రియ, నకుల్ అభ్యంకర్ లవ్లీగా ఈ పాటని ఆలపించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి డివోపీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.